TS RTC: ఆర్టీసీపై కరోనా పంజా.. 700 మందికి పాజిటివ్‌

RTC Buses
x

ఆర్టీసీ ఫైల్ ఫోటో 

Highlights

TS RTC:సరిగ్గా కోలుకుంటున్న సమయంలో ఆర్టీసీపై కరోనా పంజా విసిరింది.

TS RTC: సరిగ్గా కోలుకుంటున్న సమయంలో ఆర్టీసీపై కరోనా పంజా విసిరింది. ఇప్పటికే ఆర్టీసీ ఆదాయాన్ని మింగేసిన కరోనా... ఇప్పుడు సిబ్బందిని సైతం వదలట్లేదు. ఇప్పటికే సంస్థలో పని చేస్తున్నవారిలో సుమారు 700 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. 12 మంది మృతి చెందారు. దీంతో విధులు నిర్వర్తిస్తున్నవారు ఆందోళనకు గురవుతున్నారు.

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారింది టీఎస్‌‌ ఆర్టీసీ పరిస్థితి. లాక్‌‌డౌన్ నష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంస్థకు కరోనా సెకండ్‌‌ వేవ్‌‌తో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. కరోనా భయంతో బస్సుల్లో ఎక్కేందుకు ప్యాసెంజర్స్​ఇంట్రెస్ట్​చూపకపోవడంతో ఖాళీగా తిరుగుతున్నాయి. దీంతో కలెక్షన్స్​బాగా తగ్గి, ఆదాయం పడిపోయింది. అయితే నష్టాలకు కారణం కార్మికులు కాదు... ప్రభుత్వాల నిర్లక్ష్యమేనని అంటున్నారు ఉద్యోగులు.

వైరస్‌ విజృంభణ నేపథ్యంలో కార్మికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. అన్ని డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ కార్మికుల కోసం తార్నాకలోని అన్ని సౌకర్యాలున్న ఆసుపత్రి ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని సిబ్బంది వాపోతున్నారు. ఈ విషయంపై ఎప్పుడు చర్చ వచ్చినా... మాట దాటవేస్తున్నారు. ఫలితంగా ఉద్యోగులు కరోనాకి బలైపోతున్నారు.




Show Full Article
Print Article
Next Story
More Stories