బడి బాట పట్టిన విద్యార్థులు.. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలతో భయంభయం

Corona Third Wave Fear to Students Due to Schools Reopen
x

కరోనా థర్డ్ వేవ్ తో విద్యార్థులకు భయం (ఫైల్ ఇమేజ్)

Highlights

Schools Reopen: నిన్నటి నుంచి బడి బాట పట్టిన విద్యార్థులు

Schools Reopen: బడి గంట మోగింది. ఏడాదిన్నర కాలంగా మూసివేసిన స్కూళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. ఆఫ్‌లైన్ క్లాసులతో అరకొర విద్యతో అవస్థలు పడుతున్న విద్యార్థులు నిన్నటి నుంచి బడి బాట పట్టారు. అయితే కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో సోషల్ డిస్టాన్స్, శానిటైజేషన్ పై పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం పాఠశాలల్లో కరోనా గైడ్‌లైన్స్ పాటిస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఏడాదిన్నర తర్వాత తమ పిల్లలను భయంభయంగానే పాఠశాలలకు పంపిస్తున్నామని పలువురి విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో 1లక్ష 40వేల 903 మంది విద్యార్థులున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలు నిర్వహిస్తున్నామని స్కూల్ యాజమాన్యాలు చెప్తున్నాయి

మరోవైపు తమ పాఠశాలల యాజమాన్యాలు కరోనా గైడ్ లైన్స్ పాటించడం సంతోషంతో ఉందంటున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు.

మొత్తంగా కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొంతమంది తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంటే మరికొంత మంది తల్లిదండ్రులు మాత్రం ప్రత్యక్ష భోధనకే మొగ్గుచూపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories