Corona: సెకండ్‌ వేవ్‌లో సైలెంట్‌గా రాష్ట్రాన్ని చుట్టేస్తున్న కరోనా

Corona Second Wave Effect in Telangana
x

ఫైల్ ఫోటో 

Highlights

Corona: ప‌ల్లెల్లోకి చొచ్చుకెళ్లిన మ‌హ‌మ్మారి * గ్రామాల్లో లాక్‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితులు

Corona: సెకండ్ వేవ్‌లో కరోనా సైలెంట్‌గా రాష్ట్రాన్ని చుట్టేస్తోంది. నిన్నమొన్నటి వ‌ర‌కు ప‌ట్టణ ప్రాంతాల్లో మాత్రమే కేసులు అధికంగా క‌నిపించాయి. కానీ ఇప్పుడు ప‌ల్లెల్లోకి చొచ్చుకొచ్చిందీ మ‌హ‌మ్మారి. ఏకంగా లాక్‌డౌన్ విధించాల్సిన ప‌రిస్థితుల‌ను తీసుకొచ్చింది. జిల్లాలో భారీగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండటంతో ప్రజలు అప్రమత్తమైయ్యారు. పలు ఊళ్లలో స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో కరోనా కట్టడికి ప్రజలు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ను విధించుకున్నారు. దుకాణ సముదాయాలు, మార్కెట్ల కార్యాకలపాలు, ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా సాలూరా క్యాంప్‌లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. గ్రామంలో సుమారు 20 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజలు అప్రమత్తమైయ్యారు. 10 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించుకున్నారు. గ్రామంలో ఉన్న షాపులు బంద్‌ చేశారు. మాస్క్‌, భౌతిక దూరం తప్పక పాటించాలని తీర్మానం చేశారు. గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలిపారు. కరోనా కట్టడి కోసం నిబంధనలు పాటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories