Corona cases: భాగ్యనగరంలో ప్రమాద ఘంటికలు.. ఒక నెలలోనే 23వేల పైగా కేసులు

Corona Positive Cases Increasing in Hyderabad
x

Corona cases: భాగ్యనగరంలో ప్రమాద ఘంటికలు.. ఒక నెలలోనే 23వేల పైగా కేసులు

Highlights

Corona cases: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మన భాగ్యనగరంపై తీవ్రంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల బెడ్స్ ఫుల్ అయ్యి రోగులు బెంబేలెత్తుతున్నారు.

Corona cases: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం మన భాగ్యనగరంపై తీవ్రంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల బెడ్స్ ఫుల్ అయ్యి రోగులు బెంబేలెత్తుతున్నారు. మార్చి నెలలో 2 వేల 152 కేసులు నమోదు కాగా ఏప్రిల్ లో ఆ సంఖ్య 23వేల 672 కు చేరిందంటే ఒక్క నెలలోనే 21 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారిక లెక్కల ప్రకారమే కేసుల సంఖ్య ఇలా ఉంటే అనధికార లెక్కల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు ఉందంటున్నారు. బెడ్స్ కొరత ఓ వైపు, ఆక్సిజన్ కొరత మరోవైవు సిటీ జనాలను కంగారు పెట్టిస్తుంది.

కరోనా వైరస్‌ సృష్టించిన కల్లోలం ఏప్రిల్‌ నెలలో అధికంగా ఉంది. వేల సంఖ్యలో వైరస్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌లో 23 వేల 672 మందికి వైరస్‌ సోకింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో సగటున రోజుకు 784 మందికి వైరస్‌ సోకుతున్నట్లు నిర్ధారణ అవుతోంది. మొదటి మూడు వారాల కంటే చివరి వారంలోనే వైరస్‌ వ్యాప్తి చాలా వేగంగా ఉంది. ఏప్రిల్‌ నెలలో 21 రోజులకు 10,502 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఆ తర్వాత 9 రోజుల్లో 12,672 మందికి వైరస్‌ సోకింది.

కరోనా మొదటి దశ కంటే రెండో దశ వ్యాప్తి ఎక్కువగా ఉంది. గతేడాది మార్చిలో 74 మందికి కరోనా సోకగా, ఈ ఏడాది అదే నెలలో 2,152 మందికి వైరస్‌ సోకింది. గత ఏప్రిల్‌ నెలలో 527 మందికి కరోనా నిర్ధారణ కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 23,174 మందికి వైరస్‌ సోకింది. ఈ ఏడాది మార్చి నెల కంటే 21,022 కేసులు అధికంగా నమోదయ్యాయి. అయితే మొదటి వేవ్ లో చాలా వరకు పెద్దగా లక్షణాలు లేకపోవడం ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితులు పెద్దగా రాలేదు. కానీ, ప్రస్తుతం కేసులు జెట్ స్పీడ్ తో పెరగడమే కాకుండా వైరస్ సోకిన వారిలో తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటున్నాయి. చాలా మంది రోగులకు ఆక్సిజన్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి దీంతో ఆసుపత్రి లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గాంధీ ఆస్పత్రికి రోజూ వంద నుంచి రెండు వందల అడ్మిషన్లు వస్తుండగా టిమ్స్‌లో 30 నుంచి 50 వరకు, కింగ్‌కోఠి ఏరియా ఆస్పత్రిలో 30 వరకు, చెస్ట్‌ ఆస్పత్రిలో 20 వరకు అడ్మిషన్లు ఉంటున్నాయి. ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలలో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. ఒక్కో ఆస్పత్రిలో వెయిటింగ్‌ లిస్ట్‌ 50 నుంచి 80 మంది వరకూ ఉంది.

ఇక ఇదిలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులు బెడ్స్ ఫుల్ పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. లక్ష రూపాయలు అడ్వాన్స్ లేనిదే బెడ్స్ ఇవ్వట్లేదు. కొవిడ్ చికిత్స పేరుతో ఇష్టమొచ్చినంత దండుకుంటున్నాయి. ఇక అటు అంబులెన్స్ ల నిర్వాహకులు రేట్లను అమాంతం పెంచేశారు. ఇక కోవిడ్ రోగులకు అత్యవసర సమయంలో చికిత్స కోసం వినియోగిస్తున్న రెమిడెసివర్ లాంటి ఇంజెక్షన్స్ ను బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

మొత్తం మీద హైదరాబాద్ లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. హాట్ స్పాట్స్ లో కరోనా కట్టడి చర్యలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు ఆలస్యంగా కళ్లు తెరిచిన జీహెచ్ఎంసీ కరోనా కట్టడిలో భావంగా ఇంటింటి సర్వే చేసి కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి తగిన మందులు అందజేస్తున్నారు. మొదటి రోజు 40 వేల ఇళ్లలో ఈ సర్వే కొనసాగింది. అయితే ఆలస్యంగానైనా కళ్ళు తెరిచిన జీహెచ్ఎంసీ ఇప్పటికైనా కరోనా కట్టడికి చిత్త శుద్దితో కృషి చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories