ప్రయివేటు టీచర్లకు కరోనా వెతలు

ప్రయివేటు టీచర్లకు కరోనా వెతలు
x
Highlights

ఆయన ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు. 15ఏళ్ల పాటు ‎ఎంతో మందికి అక్షరాలతో పాటు జీవితాన్ని నేర్పించారు. చేతిలో ఉన్న ఐదు డిగ్రీలతో గతంలో కుటుంబ పోషణకు...

ఆయన ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడు. 15ఏళ్ల పాటు ‎ఎంతో మందికి అక్షరాలతో పాటు జీవితాన్ని నేర్పించారు. చేతిలో ఉన్న ఐదు డిగ్రీలతో గతంలో కుటుంబ పోషణకు పనికొచ్చాయి. కరోనా విజృంభణతో విద్యాలయాలు మూతపడడంతో ఆయనకు ఉపాధి దూరమైంది. చేతిలో ఐదు డిగ్రీలున్నా నోట్లోకి ఐదు వేళ్లు పోలేని దుస్థితి ఏర్పడింది. కరోనా కష్టకాలంలో ప్రైవేట్ ఉపాధ్యాయులు ఏదుర్కొంటున్న అవస్థలపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన హైదర్‌ఖాన్ 5 డిగ్రీలు సాధించారు. కుటుంబ పరిస్థితులు అనుకులించకపోయినా బీఏ, ఎంఏ, బీఈడీ, ఇంగ్లీష్‌లో పీజీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కరీంనగర్, చొప్పదండి, పెద్దపల్లి పట్టణాల్లో పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. తన వృత్తిలో అద్భుతంగా రాణించి అందరికి ఆదర్శంగా నిలిచారు.

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా ప్రైవేట్ టీచర్స్‌పైన పడింది. తమకోసం పని చేయించుకున్న ప్రైవేట్ విద్యాసంస్థలు ఆదుకోలేదు. దాంతో ఉపాధి కరువై కుటుంబ పోషణకు కష్టమైంది. దాంతో చేసేందుకు పనిలేక సొంతూరుకు పయనం అయ్యారు. అక్కడ కోడిగుడ్ల వ్యాపారాన్ని మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

కరోనా మహమ్మారి ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలపై పడిందని వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. తన కుటుంబాన్ని ఎలాగైనా పోషించుకోవాలనే దృఢ సంకల్పంతో హైదర్‌ఖాన్ ఒక వ్యాపారాన్ని ప్రారంభించి జీవితం గడుపుతున్నారు. చేతిలో ఐదు డిగ్రీలు ఉన్నా తాను ఈ వ్యాపారం చేయడం ఏంటని నామోషీ పడకుండా స్వశక్తితో ఈ వ్యాపారం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories