కలవరపెడుతున్న కరోనా.. నీలోఫర్‌లో ఇద్దరు చిన్నారులకు కరోనా

Corona for Two Children in Niloufer Hospital
x

కలవరపెడుతున్న కరోనా.. నీలోఫర్‌లో ఇద్దరు చిన్నారులకు కరోనా

Highlights

Corona: ఆస్పత్రిలో చిన్నారులకు చికిత్స

Corona: కోవిడ్ మరోసారి పంజా విసురుతోంది. శీతాకాలంలో కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం కలవరానికి గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే కేసులు పెరుగుతుంటం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.

తెలంగాణలోనూ కరోనా కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. లేటెస్ట్‌గా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు కరోనా సోకింది. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతున్న చిన్నారులను.. నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.అనుమానం వచ్చిన డాక్టర్లు కొవిడ్ టెస్ట్‌ చేయగా.. పాజిటివ్ వచ్చింది. చిన్నారులకు ఐసోలేషన్ వార్డులో ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు.

డిసెంబర్‌ 21న రాష్ట్రంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో నాలుగు, మెదక్‌లో ఒకటి, రంగారెడ్డి జిల్లాలో మరో కేసు నమోదయ్యింది. వీటితో కలిపి ఇప్పటి వరకు తెలంగాణలో 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories