ఐటీ కంపెనీలపై తీవ్రంగా కరోనా ప్రభావం

ఐటీ కంపెనీలపై తీవ్రంగా కరోనా ప్రభావం
x
Highlights

కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌ అన్ని రంగాలకు శాపంగా మారింది. ఏటా సుమారు లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు సాధిస్తున్న...

కరోనా వైరస్‌ యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌ అన్ని రంగాలకు శాపంగా మారింది. ఏటా సుమారు లక్ష కోట్లకుపైగా ఐటీ ఎగుమతులు సాధిస్తున్న పలు సంస్థలకు తాము పూర్తి చేయాల్సిన ఒప్పందాలకు సంబంధించిన క్లయింట్లతో సమావేశాలు వాయిదాపడ్డాయి. ఆయా దేశాల్లో తమ కంపెనీలు చేజిక్కించుకున్న ప్రాజెక్టుల పూర్తికి పలు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి తమ సంస్థల టెకీలను ఆయా దేశాలకు పంపించేందుకు బ్రేకులు పడ్డాయి.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్‌ ఫ్రం హోంకే పరిమితం చేశాయి. దీంతో ఉత్పాదకత గతంతో పోలిస్తే మోస్తరుగా తగ్గిందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఇప్పటికే తమ సంస్థలు చేపట్టిన ప్రాజెక్టులు పూర్తిచేయడం ఆలస్యమవుతాయని పలు సంస్థల నిపుణులు చెబుతున్నారు.

గ్రేటర్‌ పరిధిలో సుమారు 900 ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. ఈ కంపెనీల్లో సుమారు వంద వరకు మైక్రోసాఫ్ట్, గూగుల్‌ వంటి పెద్ద కంపెనీలున్నాయి. ప్రస్తుతం కరోనా కలకలం, లాక్‌డౌన్‌‌తో తాము చేపట్టిన ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నట్లు మెజారిటీ ఐటీ కంపెనీలు చెబుతున్నాయి. దీంతో తమకు మోస్తరుగా నష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్లు తెలిపాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, జరిగిన నష్టంపై నాస్కామ్‌ ఆధ్వర్యంలో అధ్యయనం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి తెలిపారు. త్వరలో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కరోనా ఎఫెక్ట్‌ నుంచి హైదరాబాద్‌లోని ఐటీ రంగం నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఐటీ, హార్డ్‌వేర్‌ పాలసీ రాకతో ఈ రంగం గణనీయంగా పురోగమిస్తుందని చెప్పారు. కొన్నిరోజుల పాటు అనిశ్చితి నెలకొన్నప్పటికీ త్వరలో పరిస్థితులు చక్కబడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories