కరోనాతో కుదేలైన నిర్మాణ రంగం.. అడ్డా కూలీలపై ఆధారపడ్డ బిల్డర్స్‌

కరోనాతో కుదేలైన నిర్మాణ రంగం.. అడ్డా కూలీలపై ఆధారపడ్డ బిల్డర్స్‌
x
Highlights

కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగాన్ని కూడా కుదేలయింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన బిల్డర్లు వడ్డీలు కట్టుకునేందుకు...

కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు నిర్మాణ రంగాన్ని కూడా కుదేలయింది. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన బిల్డర్లు వడ్డీలు కట్టుకునేందుకు ఆస్తులను తాకట్టు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లో అతి వేగంగా దూసుకు పోయో నిర్మాణ రంగం పూర్తిగా ఆగిపోయింది. కరోనా కారణంగా నగరాన్ని విడిచిపోయిన నిర్మాణ రంగ నిపుణులు, కూలీలు తిరిగి రాక పోవడంతో బిల్డర్ప్ పరిస్థితి అయోమయంగా మారింది.

కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోయినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో పాటు భవన నిర్మాణ రంగ పనులు జరుగుతున్నాయి. అయితే మహమ్మారి కారణంగా చాలా మంది స్వస్థలాలకు వెళ్లి పోవడంతో గ్రేటర్ హైదరాబాద్ లో కూలీల కొరతతో నిర్మాణ పనులకు ఆటంకం కలుగుతోంది. సొంతూళ్లకు వెళ్లిన వారు ఇంకా తిరిగి రాకపోవడంతో ఉన్నవారితోనే బిల్డర్లు పనులు చేయించుకున్నారు. అయితే సకాలంలో పనులు పూర్తి కాక పోవడంతో అడ్డా కూలీలతో పనులు చేయించుకుంటున్నారు. కరోనాకు ముందు అడ్డాకూలీలకు రోజుకు 500 నుండి 800 చెల్లించేవారు. ప్రస్తుతం కూలీలు వెయ్యి రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక బిల్డర్స్ మాటా అలా ఉంటే అడ్డాకూలీలు మరో వర్షన్ వినిపిస్తున్నారు. ఇద్దరు చేయాల్సిన పనిని ఒక్కరికే అప్పగిస్తున్నారని చెబుతున్నారు. వెయ్యి రూపాయాలు ఇస్తామని చెప్పి 600, 700 ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిపుణులైన కార్మికులు లేక కొందరు బిల్డర్లు వారి నిర్మాణాలను నిలిపివేశారు. మరికొందరు ఉన్న లేబర్ తోనే నెట్టు కోస్తున్నారు. ఒకవైపు గడువు మీరిపోవడంతో ఇళ్లను అప్పగించాలని యజమానుల ఒత్తిడి, మరో వైపు అందుబాటులో లేని కార్మికులకు తోడు పెరిగిన కూలీల ధరలతో సతమతం అవుతున్నామని బిల్డర్లు చెబుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories