సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్ కు షాక్.. క్యారీ బ్యాగ్ లు ఉచితంగా ఇవ్వాల‌ని ఆదేశాలు

Consumer Court Notices to Hyder Gowda Dmart
x

హైదర్ గూడా డిమార్ట్ కు కన్సూమర్స్ కోర్ట్ నోటీసులు(ఫోటో-ది హన్స్ ఇండియా)

Highlights

హైదర్ గూడా డిమార్ట్ కు కన్సూమర్స్ కోర్ట్ నోటీసులు.. కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్ డబ్బులు వసూలు చేసినందుకు ఫైన్

Carry Bags: కస్టమర్లు షాపింగ్ కోసం వచ్చినప్పుడు వారి నుంచి క్యారీ బ్యాగ్ డబ్బులు వసూలు చేసే కంపెనీలకు గట్టి షాక్ ఇచ్చింది హైదరాబాద్ లోని వినియోగదారుల ఫోరం.. ఇకపై షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, వాణిజ్య సముదాయాల్లో షాపింగ్ చేసినప్పుడు కస్టమర్లకు కంపెనీలే ఉచితంగా క్యారీ బ్యాగ్ లు సరఫరా చేయాలని కన్సూమర్స్ ఫోరం తీర్పు చెప్పింది. కస్టమర్ల నుంచి క్యారీ బ్యాగ్ ఫీజ్ వసూలు చేయరాదని స్పష్టం చేసింది.

హైదర్ గూడాలోని డీ మార్ట్ కంపెనీ క్యారీ బ్యాగ్ కు మూడున్నర రూపాయలు వసూలు చేయడంపై ఒక కస్టమర్ కన్సూమర్స్ ఫోరంని ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన కోర్ట్ ఇకపై ఉచితంగానే క్యారీ బ్యాగ్ లు ఇవ్వాలని ఆదేశించింది. సదరు కస్టమర్ కు, కన్సూమర్స్ కోర్టుకు హైదర్ గుడా డీమార్ట్ వెయ్యి చొప్పున జరిమానా చెల్లించాలని ఆదేశించింది. తీర్పు అమలుకు 45 రోజులు డెడ్ లైన్ పెట్టింది. ఈలోగా తీర్పు అమలు చేయకపోతే 18 శాతం వడ్డీతో చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశాలు జారీ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories