Telangana Congress: కామ్రేడ్స్‌తో పొత్తుల కోసం కాంగ్రెస్ వ్యూహం

Congress Strategy For Alliances With Comrades
x

Congress: కామ్రేడ్స్‌తో పొత్తుల కోసం కాంగ్రెస్ వ్యూహం

Highlights

Telangana Congress: ఆ నియోజకవర్గాలు తమకి కేటాయించాలంటున్న కమ్యూనిస్టులు

Telangana Congress: కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌తో పొత్తు వికటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పైగా దేశంలో ఇండియా కూటమిలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఉన్నారు. ఇందులో భాగంగా.. కామ్రేడ్స్‌తో పొత్తుల కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది. ఉభయ కమ్యూనిస్టు నేతలకు ఇంఛార్జ్ థాక్రే ఫోన్ చేసి ఆహ్వానించినట్లు సమాచారం. ఇప్పటికే కలిసి వచ్చే వారితో ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ నిర్ణయించింది.

ఇదిలా ఉండగా.. కామ్రేడ్స్‌తో పొత్తులపై కాంగ్రెస్‌లో ఆసక్తికరమైన చర్చ మొదలయ్యింది. ఎక్కువ సీట్లు అడగకుండా కామ్రేడ్స్‌కి నచ్చ చెప్పాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కమ్యూనిస్టులతో కలిసిపోతే..చాలా చోట్ల గెలుపును ప్రభావితం చేస్తాయంటున్న ఏఐసీసీ నేత... ఎవరికీ నష్టం జరగకుండా సీట్ల సర్దుబాటుకి ప్రయత్నం చేయాలని మరోనేత సూచించినట్లు సమాచారం. అయితే మొదట సీట్ల అంశం తేలితేనే పొత్తుపై ముందుకు వెళ్తామంటున్నారు సీపీఎం నేతలు. వామపక్షాలు అడుగుతున్న స్థానాల్లో కాంగ్రెస్‌కి బలమైన నేతలున్నారు. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని భావిస్తున్నారు. పాలేరు, కొత్తగూడెం, హుస్నాబాద్, బెల్లంపల్లి, మిర్యాలగూడ, మునుగోడు, దేవరకొండ స్థానాల కోసం వామపక్షాలు పట్టుబడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories