Madan Mohanrao: ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించాలి

Congress Party Should Be Given A Chance And Win Says Madan Mohanrao
x

Madan Mohanrao: ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించాలి

Highlights

Madan Mohanrao: బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించింది

Madan Mohanrao: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేస్తున్న మదన్‌ మోహన్‌రావును నియోజకవర్గంలో గ్రామస్ధులు ఆదరిస్తున్నారు. ప్రచారానికి వెళ్తున్న మదన్‌రావుకు అడుగడుగునా మహిళలు,గ్రామస్తులు, డప్పు చప్పుళ్లతో బోనాలతో ఘనంగా స్వాగతం పలుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సంవత్సరాలు పాటు ఏమీ చేయని ఎమ్మెల్యే సురేందర్‌ అని మదన్‌మోహన్‌ రావు ఎద్దేవా చేశారు. తాడ్వాయ్ మండలంలోని

పలు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామగ్రామాన కాంగ్రెస్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. ఎంతో నమ్మకంతో విరాళాలు ఇచ్చి గత ఎన్నికల్లో గెలిపించుకున్న సురేందర్‌ బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని పేర్కొన్నారు. ఒక్కసారి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories