ఈయనను గుర్తుపట్టారా.. గెటప్ మార్చిన ఈ లీడర్ ఎవరో చెప్పుకోండి..?

Congress MLA Jagga Reddy New Style
x

ఈయనను గుర్తుపట్టారా.. గెటప్ మార్చిన ఈ లీడర్ ఎవరో చెప్పుకోండి..?

Highlights

Congress MLA: రాష్ట్ర రాజకీయ నేతల్లో ఆయన రూపే సెపరేటు.. విషయమేదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడతాడు.

Congress MLA: రాష్ట్ర రాజకీయ నేతల్లో ఆయన రూపే సెపరేటు.. విషయమేదైనా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొడతాడు. గెటప్ మార్చినా, డ్యాన్స్ చేసినా, ఏపని చేసినా ఆయనకు ఆయనే సాటి. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. చేయాలనుకున్నది చేసేస్తారు. సందర్భం ఏదైనా తనరూటే సెపరేట్ అంటూ నిరూపించుకుంటారు. ‎ప్రజలతో మమేకం అవుతారు. అవసరమైతే యూత్‎తో పోటీగా స్టెప్పులేస్తారు? గుబురు గడ్డం, పెద్ద మీసాలతో గంభీరంగా ఉండే ఆయన స్టేట్ పాలిటిక్స్‎లో ఫైర్ బ్రాండ్ అన్న మార్క్ సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడాయన గెటప్ పూర్తిగా మారిపోయింది. ఎంత ఆలోచించినా గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. ఇంతకీ గెటప్ మార్చిన ఆ ఎమ్మల్యే ఎవరు? మున్ముందు తనలో కొత్త వ్యక్తి చూస్తానంటున్నారు. ఇంతకీ ఎవరా నేత.. ఏంటి అతనకున్న సెపరేట్ స్టైల్..?

సామాన్యుడిలా కనిపిస్తున్న ఈయనను గుర్తుపట్టారా? మరొకసారి చూడండి... గుర్తుపట్టారా? లేదు కదా గుర్తుపట్టలేనంతగా మారిన ఈయనే జగ్గారెడ్డి. సంగారెడ్డి ఎమ్మెల్యే. అవును మీరు చూస్తున్నది నిజమే. ఈయనే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పెద్ద గడ్డం, గుబురు మీసాలతో వేలమందిలో ఉన్నా ఇట్టే గుర్తుపట్టగలిగె ఎమ్మల్యే జగ్గారెడ్డి ఇలా మారిపోయారు అనుకుంటున్నారు కదూ. ఇలా తన గెటపే కాదు, మున్ముందు ఆయనలో కొత్త జగ్గారెడ్డి కనిపిస్తాడట. తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వెళ్లిన జగ్గన్న ఇవాళ స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు. తలనీలాలు సమర్పించిన తర్వాత జగ్గన్న గెటప్ ఇలా మారింది. గడ్డం, మీసాలు లేకుండా జగ్గారెడ్డి ఫోటో ఇలా బయటకు వచ్చిందో లేదో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఈ లీడర్ ఎవరో చెప్పుకోండి అంటూ వాట్స్ ఆప్, ఫేస్ బుక్‎లలో సరదాగా సవాల్ విసురుతున్నారు నెటిజన్లు.

సడన్ గా తిరుపతి దర్శనం, తలనీలాలు సమర్పించడం వెనుక ఎదైన ప్రత్యేకతా ఉందా అంటూ hmtv జగ్గారెడ్డిని వాకబు చేసింది. సడన్‎గా నిన్న తిరుపతి వెళ్ళాలని అనిపించిందనీ, అనుకున్న వెంటనే బయలుదేరి వచ్చేసి స్వామివారికి తలనీలాలు సమర్పించానని తెలిపారు. ఇకపై గడ్డంతో జగ్గారెడ్డి గెటప్ ఉండదని చెప్పాడు. గతంలో మాదిరిగా అంతలా గడ్డం పెంచనని స్పష్టం చేశారు. ఇకపై తన గేటపే కాదు అన్నింట్లో మార్పులు ఉంటాయన్నారు. ఇకపై కొత్త జగ్గారెడ్డిని చూస్తారని తెలిపారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పిన జగ్గారెడ్డి ఇప్పుడు తనలో మరిన్ని మార్పులుంటాయంటున్నారు. ఏం మార్పులుంటాయన్నది ఆసక్తిగా మారింది.


Show Full Article
Print Article
Next Story
More Stories