Congress: ఇవాళ కాంగ్రెస్‌ మైనార్టీ డిక్లరేషన్‌ ప్రకటన

Congress Minority Declaration Realising Today
x

Congress: ఇవాళ కాంగ్రెస్‌ మైనార్టీ డిక్లరేషన్‌ ప్రకటన

Highlights

Congress: రేపు బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్న కాంగ్రెస్‌

Congress: ఇవాళ సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించనుంది. CWC సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ ప్రతాప్, నాసిర్ హుస్సేన్‌ చేతుల మీదుగా మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నారు. హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్‌లో నాంపల్లి మైనార్టీలతో సభ జరగనుంది. కార్యక్రమానికి ఏఐసీసీ ఇంఛార్జ్‌ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇతర మైనార్టీ నేతలు హాజరుకానున్నారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల ఆర్ధిక అభ్యున్నతికి తీసుకునే చర్యలను డిక్లరేషన్‌లో కాంగ్రెస్ పొందుపరిచింది. ఇప్పటికే రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. రేపు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి అనంతరం మహిళా డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించనుంది.

తెలంగాణలో 14 శాతం మైనార్టీలు ఉన్నారు. ఎన్నికల్లో 40 నియోజవర్గల్లో మైనార్టీల ప్రభావం ఉండనుంది. ఇప్పటికే మైనార్టీల జనాభా వారి స్థితిగతులపై కాంగ్రెస్ అధ్యయనం చేసింది. ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు. బౌద్ధులు, జైన్ కమ్యూనిటీ ఆర్ధిక, సామాజిక స్థితిగతులపై కూడా కాంగ్రెస్‌ అధ్యయనం చేసింది.

మైనార్టీ డిక్లరేషన్‌‌లో చాలా ముఖ్యమైన అంశాలను కాంగ్రెస్ పొందుపరిచినట్టు సమాచారం. మైనార్టీలకు సబ్‌ప్లాన్ ఏర్పాటు చేసి 5 వేల కోట్ల కేటాయించనున్నారు. 2014 తర్వాత వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతం నేపథ్యంలో వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోని తిరిగి వక్ఫ్ బోర్డులకు అప్పగించడం వంటివి మైనార్టీ డిక్లరేషన్‌లో పొందుపరిచారని తెలుస్తోంది. మైనార్టీలు సంపూర్ణ అభివృద్దే ధ్యేయంగా డిక్లరేషన్ ప్రకటిస్తారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories