మునుగోడు అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ వరుస భేటీలు

Congress Leaders Meet On Munugode By Election
x

మునుగోడు అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్ వరుస భేటీలు 

Highlights

Congress: ఫైనల్ రిపోర్ట్ తయారు చేసే పనిలో నేతలు

Congress: హుజూరాబాద్ లో ఓడిపోయింది అందుకేనన్న కాంగ్రెస్ నేతలు మునుగోడు కోసం గుణపాఠాలు నేర్చుకోలేక పోతున్నారా..రోజుల కొద్ది వేయిటింగులు, గంటల కొద్దీ చర్చలు కాంగ్రెస్ అభ్యర్థిని ఫైనల్ చేయలేకపోతున్నాయా... ఆశావాహులను గాంధీ భవన్ కి పిలుస్తున్న కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారు..ఏ విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటికే అనేకసార్లు సమావేశమైన హస్తం నేతలు అభ్యర్థి ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోసారి అభ్యర్థులతో భేటీ అయిన నేతలు ఫైనల్ రిపోర్ట్ ను తయారు చేసే పనిలో పడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తులో వేగం పెంచింది. ఇప్పటికే ఆశావాహ నేతలతో భేటీ అయిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఓ అంచనాకు వచ్చారు. అయినా మరోసారి గాంధీ భవన్ టిక్కెట్ ఆశిస్తున్న అభ్యర్థులతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క సమావేశమయ్యారు.

నలుగురు ఆశావాహులతో భేటీ అయిన నేతలు టిక్కెట్ ఎవరికి ఇచ్చినా మిగతా వారు సహకరించాలని సూచించారట. అయితే టిక్కెట్ ఆశావాహులతో విడివిడిగా భేటీ అయిన నేతలు పలు అంశాలపై క్లారిటీ తీసుకున్నట్లు సమాచారం. టిక్కెట్ మీకు ఇస్తే ఏం చేస్తారు.మీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి. ఒకవేళ టిక్కెట్ మీకు కాకుండా ఇవ్వాలంటే మరెవరికి ఇవ్వాలి. ప్రస్తుతం మునుగోడులో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి.. ఇలాంటి అనేక ప్రశ్నలు సంధించారని తెలుస్తుంది.

మరోవైపు ఆశావాహ నేతలతో మీటింగ్ అనంతరం హైదర్ గూడ క్వార్టర్స్ లో ఉన్న ఇంఛార్జ్ ఠాగూర్ తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భట్టి ,రాంరెడ్డి దామోదర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో పీసీసీ కసరత్తు చేసిన నివేదికను ఇంఛార్జ్ ఠాగూర్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories