Vijayashanthi on Private School Teachers Problem: తెలంగాణలో టీచర్ల తిప్పలు.. కేసీఆర్ ఇప్పటికైనా స్పందించాలి

Vijayashanthi on Private School Teachers Problem: తెలంగాణలో టీచర్ల తిప్పలు.. కేసీఆర్ ఇప్పటికైనా స్పందించాలి
x
vijayshanthi, KCR (Filr Photo)
Highlights

Vijayashanthi on Private School Teachers Problem: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో వేసవి సెలవులు మొదలు కాక ముందునుంచే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే.

Vijayashanthi on Private School Teachers Problem: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో వేసవి సెలవులు మొదలు కాక ముందునుంచే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించిన విషయం తెలిసిందే. వేసవి సెలవులు గడిచిపోయినప్పటికీ కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో పాఠశాలలను ఇప్పట్లో తెరిచే అవకాశం కూడా కల్పించడంలేదు. దీంతో ప్రయివేటు స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయులు చాలా మంది వారి ఉపాధిని కోల్పోయారు. నెలల తరబడి వేతనం లేకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ పోషణ కోసం వారికి తోచిన పనులు చేస్తున్నారు. కొంత మంద ఉపాధి కూలీలులగా మారితే, మరికొంత మంది ఉపాధ్యాయులు పండ్లు, కూరగాయలు విక్రయిస్తున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు టిఫిన్ సెంటర్లు నడుపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

ప్రయివేట్ టీచర్ల కష్టాలను తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. రాష్ట్రంలో చాలా ప్రయివేట్ విద్యాసంస్థలు టీచర్లను ఇష్టమొచ్చినట్టు తొలగించి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాయన్నారు. కొందరికి మాత్రం చాలీచాలని జీతాలిచ్చి.. ఇంకొందరికి అడ్మిషన్లు తెస్తేనే మీ ఉద్యోగం ఉంటుందని వార్నింగ్ ఇచ్చాయన్నారు. తెలంగాణలో ప్రయివేట్ టీచర్లు వీధినపడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రతిష్టకు మచ్చగా మారిందన్నారు. ప్రయివేట్ స్కూల్ టీచర్ల వ్యథ గురించి ప్రధాన మీడియాలో, సోషల్ మీడియాలో కుప్పలుతెప్పలుగా వార్తలు వస్తున్నప్పటికీ తెలంగాణ సర్కారు మాత్రం ఏమీ చలించడం లేదన్నారు.

గత కొద్ది రోజులుగా ఉద్యోగం కొల్పోయిన ప్రయివేటు టీచర్ల గురించి వచ్చిన వార్తలను గమనిస్తే మహిళా టీచర్లు కొందరు బీడీలు చుట్టే పనుల్లోకి, మాస్కుల తయారీ, టైలరింగ్ ఇంకా ఉపాధి హామీ పనుల్లోకి వెళ్ళాల్సి వచ్చిందన్నారు. ఇటు ఖమ్మంలో ఓ ఉపాధ్యాయుడు టిఫిన్ బండి పెట్టుకున్నారన్నారు. యాదాద్రిలో మరొక ప్రయివేట్ స్కూల్ టీచర్ కుటుంబాన్ని పోషించుకోవడానికి దినసరి కూలీగా మారారని తెలిపారు. మన గ్రంథాలు, సమాజ వ్యవస్థలు గురువులకు ఎంతో గౌరవానిస్తే, తెలంగాణలో మాత్రం ఉపాధ్యాయులు పొట్టకూటి కోసం తిప్పలు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories