V. Hanumanth Rao Recovered from Covid19: కరోనా నుంచి కోలుకున్న వీహెచ్..

V. Hanumanth Rao Recovered from Covid19: కరోనా నుంచి కోలుకున్న వీహెచ్..
x
V. Hanumanth Rao (File Photo)
Highlights

V. Hanumanth Rao Recovered from Covid19: తెలంగాణలోని కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరుసగా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే.

V. Hanumanth Rao Recovered from Covid19: తెలంగాణలోని కొంత మంది ఎమ్మెల్యేలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు వరుసగా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా కరోనా బారిన పడి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వైరస్‌ను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. 71 ఏళ్ల వీహెచ్‌కు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ పది రోజుల్లోనే కరోనా నుంచి కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక జూన్ 21వ తేదీన వీహెచ్ కరోనా లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరిన అనంతరం అధికారులు ఆయన భార్యకు కూడా కరోనా టెస్టులు చేయడంతో ఆమెకు కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె కూడా అపోలో హాస్పిటల్‌లోనే చేరారు. కాగా వీహెచ్ తో పాటు ఆయన భార్య కూడా కరోనా నుంచి కోలుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వీహెచ్ మాట్లాడుతూ ఆయనకు హాస్పిటల్‌లో జ్వరం, దగ్గు తగ్గడానికి మందులు ఇచ్చారని ఆక్సిజన్ కూడా అవసరమైందని తెలిపారు. రోజూ మార్నింగ్ వాక్ చేయడం తనకు అలవాటన్న వీహెచ్.. మానసికంగా ధైర్యంగా ఉండటం అవసరమన్నారు.

ఆసుపత్రిలో ఉన్నప్పుడు శాకాహారం తీసుకున్నానన్నారు. కరోనా విషయంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హాస్పిటల్‌లో ఉన్న సమయంలోనూ ఆయన బీసీల తరఫున గళం వినిపించారు. తన మిగిలిన జీవితాన్ని బడుగు బలహీన వర్గాలను ఏకం చేయడం కోసం కేటాయిస్తానని తెలిపారు. తన ఆరోగ్యం మెరుగుపడాలని, కరోనా నుంచి కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories