దీక్షకు దిగే దమ్ముందా ?.. ఎమ్మెల్యే సండ్రకు సవాల్ విసిరిన మానవతా రాయ్..

Congress Leader Manavatha Roy Fired on MLA Sandra Venkata Veeraiah
x

దీక్షకు దిగే దమ్ముందా ?.. ఎమ్మెల్యే సండ్రకు సవాల్ విసిరిన మానవతా రాయ్..

Highlights

Manavatha Roy: వట్టి చేతులతో వచ్చిన ఎమ్మెల్యే కోట్లు పోగేసాడని, సింగరేణి బాధిత ప్రజల కోసం తమతో పాటు ఆమరణ దీక్షకు దిగే దమ్ము ఉందా అని..

Manavatha Roy: వట్టి చేతులతో వచ్చిన ఎమ్మెల్యే కోట్లు పోగేసాడని, సింగరేణి బాధిత ప్రజల కోసం తమతో పాటు ఆమరణ దీక్షకు దిగే దమ్ము ఉందా అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు సవాల్ విసిరారు టీపీసీసీ అధికార ప్రతినిధి మానవతా రాయ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం వెంగల్ రావునగర్ కాలనీ వద్ద సింగరేణి ప్రభావిత ప్రాంత ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ మానవతారాయ్ ఆమరణ నిరాహారదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవటంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు, కాలని వాసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది.

మానవతారాయ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాన్ని కాలని వాసులు అడ్డుకున్నారు. సీఎం డామ్ డామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న బాంబ్ పేలుళ్ల ధాటికి దెబ్బతిన్న, కూలిపోయిన ఇళ్లకు ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆమరణ దీక్ష చేస్తుంటే న్యాయం చేయాల్సిన ఎమ్మెల్యే పోలీసులతో కలిసి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేశారని ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories