Mallu Bhatti Vikramarka: మహిళా సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

Congress government has given high priority to women empowerment Says Mallu Bhatti Vikramarka
x

Mallu Bhatti Vikramarka: మహిళా సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

Highlights

Mallu Bhatti Vikramarka: కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యం

Mallu Bhatti Vikramarka: మహిళా సాధికారతకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కోటి మంది మహిళలను.. కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, వీరి సంఖ్యను కోటికి పెంచి వారందరినీ కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుందన్నారు.

స్వయం సహాయక సంఘాలకు ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 140 కోట్ల రూపాయలను బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించామని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఈ రుణాలకు అయిన 1566కోట్ల రూపాయల వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందన్నారు. కొత్త విద్యుత్ పాలసీలో మహిళలను సోలార్ విద్యుత్ పైపు మళ్లించి ఆర్థికంగా ప్రోత్సహిస్తామన్నారు. ప్రభుత్వమే రుణాలు ఇప్పించి,, బ్యాటరీ బస్సులు కొనుగోలు చేయించి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

Show Full Article
Print Article
Next Story
More Stories