తెలంగాణ ఆవిర్భావ సంబురం.. ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు, పూర్తి షెడ్యూల్ ఇదే..

Congress Government All Set For Telangana Formation Day Decennial Celebrations June 2 Full Schedule
x

తెలంగాణ ఆవిర్భావ సంబురం.. ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు, పూర్తి షెడ్యూల్ ఇదే..

Highlights

ఉదయం పరేడ్‌గ్రౌండ్‌లో.. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు‎ సర్వం సిద్ధమైంది. ఉదయం తొమ్మిదిన్నరకు గన్ పార్క్ లో అమర వీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, పలు సంస్థల మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరించి ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు. రాష్ట్ర గీతావిష్కరణ తరువాత సోనియాగాంధీ వీడియో సందేశం ఉంటుంది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫోటో సెషన్‌తో కార్యక్రమం ముగుస్తుంది.

ఇక సాయంత్రం ట్యాంక్ బండ్ మీద తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆరు గంటల 50 నిమిషాలకు గంటలకు ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత హుస్సేన్ సాగర్ పై ఆకాశంలో పది నిమిషాల పాటు జరిగే ఫైర్ వర్క్స్‌ కార్యక్రమంతో వేడుకలు ముగుస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories