ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళన

Congress concern at government offices today
x

ఇవాళ ప్రభుత్వ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ ఆందోళన

Highlights

Congress : *రాజ్ భవన్ ముట్టడిలో దాడులపై నిరసన

Congress : రాజ్ భవన్ ముట్టడిలో కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాలన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి . కేంద్రం డైరెక్షన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో రాజ్ భవన్ ముట్టడిని భగ్నం చేసిందని మండిపడ్డారు.

రాహుల్ ను ఈడీ విచారించడం పట్ల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు , నిరసనలు చేపడుతున్నారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు రాజ్ భవన్ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించగా అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో పోలీసులకు , కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం , అరెస్ట్ లు వంటివి జరిగాయి. కాగా పోలీసుల లాఠీచార్జి లో పలువురు కాంగ్రెస్ నేతలు , కార్య కర్తలు తీవ్రంగా గాయపడ్డారు.

కాంగ్రెస్ శ్రేణులపై దాడులను నిరసిస్తూ ఇవాళ జిల్లా కేంద్రాల్లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు నేతలు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ ముట్టడిలో అరెస్ట్ అయినా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాకా మీడియాతో మాట్లాడారు. కేంద్రాన్ని సంతృప్తి పరిచేందుకే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ శ్రేణులపై దాడులు చేయించిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రహస్య ఆదేశాలతోనే తమ శాంతియుత ర్యాలీని పోలీసులు భగ్నం చేశారని, తద్వారా నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకునేందుకు యత్నించారని ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జీలో గాయపడి ఆసుపత్రిపాలైన టీపీసీసీ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ చామలను రేవంత్ రెడ్డి పరామర్శించారు. కిరణ్ కుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories