Congress: నేటి నుంచి మునుగోడుపై కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ
Congress: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. టీఆర్‌ఎస్, బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలో ఉంటూ వ్యూహాలు అమలు చేస్తుండడంతో దీటుగా ఎదుర్కోవాలని నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఇంటింటి కాంగ్రెస్ పేరుతో మునుగోడులోని ఏడు మండలాల్లో పర్యటిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కేటాయించిన ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ వ్యతిరేక విధానాలే టార్గెట్‌గా మునుగోడు ప్రచారం సాగుతుందన్నారు.
మన మునుగోడు - మన కాంగ్రెస్ అనే నినాదాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాలని రేవంత్ తెలిపారు. స్థానిక నాయకులను కలుపుకొని జనంలోకి వెళ్లాలని.. బీజేపీ, టీఆర్‌ఎస్ వైఖరిని ఎండగట్టాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రాజగోపాల్ రెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని, ఆర్థిక ఒప్పందంలో భాగంగానే బీజేపీలో చేరారని జనంలోకి తీసుకెళ్లాలని రేవంత్ తెలిపారు. మండలాలు, పంచాయతీల వారీగా బీజేపీ, టీఆర్‌ఎస్ చేరిన నేతలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించడం ద్వారా ఆయా పార్టీలపై వ్యతిరేకత పెంచాలని నిర్ణయించారు.
ఈ నెల 3న ముఖ్య నాయకులు ప్రచారంలో పాల్గొని.. ఆ తరువాత నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ ఇందులో పాల్గొంటారని తెలుస్తోంది. అభ్యర్థి ఎంపిక విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఇప్పటికే పలువురు ఎంపీటీసీలు, సర్పంచిలు పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల పార్టీ క్యాడర్‌లో ఆత్మస్థ్యైర్యం పెంపొందించాలని పీసీసీ నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే అభ్యర్థిని ప్రకటించడం సరికాదని భావిస్తోంది. అన్ని అంశాలపై చర్చించి ఆశావహుల అభిప్రాయాలను కూడా తీసుకుని సమగ్ర నివేదికను అధిష్ఠానానికి పంపింది. ఆశావహుల్లో టికెట్ ఎవరికి వస్తుందనే విషయాన్ని పక్కనపెట్టి.. జనంలోకి వెళ్లడం ద్వారా పార్టీ బలోపేతం అవుతుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire