బాసర ట్రిపుల్‌ ఐటీ సీట్ల కేటాయింపుల్లో గందరగోళం!

బాసర ట్రిపుల్‌ ఐటీ సీట్ల కేటాయింపుల్లో గందరగోళం!
x
Highlights

బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కేటాయింపులపై గందరగోళం నెలకొంది. సీట్‌ అలాట్‌మెంట్‌లో కీ రోల్‌ అయిన గ్రేడ్‌లే అధికారులను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. కరోనా...

బాసర ట్రిపుల్‌ ఐటీలో సీట్ల కేటాయింపులపై గందరగోళం నెలకొంది. సీట్‌ అలాట్‌మెంట్‌లో కీ రోల్‌ అయిన గ్రేడ్‌లే అధికారులను కన్ఫ్యూజన్‌లో పడేశాయి. కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది అందరికీ మెరిట్‌ స్కోర్ రావటం గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో దరఖాస్తులు రావటంతో సీట్లు ఎవరికి వస్తాయి..? ఏ ప్రాతిపదికన ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే సబ్జెక్టులు, బర్త్‌డేట్‌ ప్రామాణికంగా సీట్ల కేటాయింపు జరుగుతుందంటున్నారు అధికారులు.

కరోనా నేపథ్యంలో తెలంగాణ సర్కార్ పదవ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసింది. దాంతో బాసర ట్రిపుల్ ఐటీ సీట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గతేడాది ముప్పైవేల మంది విద్యార్థులు దరఖాస్తు చేస్తే ఈసారి ఆ సంఖ్య 40 వేలు దాటింది. అయితే అందులోనూ పదింటికి పదిగ్రేడ్లు సాదించిన విద్యార్థులు 90శాతం ఉండటంతో సీట్ల కేటాయింపు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రైవేట్ పాఠశాలలో చదివిన వారి కంటే సర్కార్ బడుల్లో చదివిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పది గ్రేడ్లు సాధించిన వారికి 0.4 మార్కుల వెయిటేజీ కలపనున్నారు.

ఒకవేళ జీపీఎ పాయింట్లు టై అయితే మ్యాథ్స్‌లో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ కూడా మార్కులు సమానంగా ఉంటే ఒక్కొక్క సబ్జెక్టు వారీగా మార్కులను చూసి సీట్లు కేటాయించనున్నారు. ఇక సబ్జెక్టుల వారీగా కూడా సమానమైన మార్కులొస్తే బర్త్‌డేట్‌ ప్రకారం సీట్లు కేటాయిస్తామంటున్నారు అధికారులు. ఇక పుట్టిన తేదిలలో టై అయితే లోయస్ట్ ర్యాండమ్ పద్ధితితో విద్యార్థులను ఎంపిక చేస్తామంటున్నారు. ఇక ఒక్కసారిగా అధిక దరఖాస్తులు రావటంతో అటు అధికారులతో పాటు విద్యార్థుల్లోనూ ఆందోళన మొదలైంది. ఎవరికి సీట్ల కేటాయింపు జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు స్టూడెంట్స్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories