Telangana: తెలంగాణలో వార్షిక పరీక్షలపై విద్యార్థుల్లో ఆందోళన

Concern Among Students for Annual Exams in Telangana
x

తెలంగాణ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Telangana: ఓ వైపు సిలబస్‌ పూర్తి కాకపోవడంతో పరీక్షల నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

Telangana: వార్షిక పరీక్షలు జరుగుతాయా? పది, ఇంటర్ విద్యార్థుల పరిస్థితేంటి..? విద్యాసంస్థలు మూసివేయాలన్న ప్రభుత్వం.. పరీక్షలపై ఏ నిర్ణయం తీసుకుంటుంది..? లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మెదులుతున్న ప్రశ్నలివి. ఓ వైపు ఎగ్జామ్‌పై క్లారిటీ లేదు. మరోవైపు సిలబస్‌ పూర్తి కాలేదు. దీంతో పరీక్షల నిర్వహణ ఏ విధంగా జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.

పరీక్ష తేదీలను ప్రకటన..

మే 1 నుంచి 19 వరకు ఇంటర్‌ పరీక్షలు.. మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయా బోర్డులు ప్రకటించాయి. కొవిడ్ టైమ్ కాబట్టి ఇప్పటికే సిలబస్‌లో 30 శాతం తగ్గించింది ప్రభుత్వం. దీంతో పాటు ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్‌ కూడా పెంచారు. 30 శాతం తగ్గించినా కేవలం 40 రోజుల ప్రత్యక్ష బోధనేతో పరీక్షలెలా నిర్వహిస్తారనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇక టెన్త్‌లో ఫార్మేటివ్ అసెస్‌మెంట్‌‌కు సంబంధించి 20 మార్కులు జతచేస్తారు. అయితే రెండు అసెస్‌మెంట్‌లు జరగాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఒకటే అసెస్‌మెంట్ పూర్తైంది. దీంతో రెండో అసెస్‌మెంట్ జరగకుంటే మొదటి పరీక్ష ఆధారంగా ఉత్తీర్ణులను చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంటర్‌ విద్యార్థుల్లో ఉత్కంఠ...

అటు ఇంటర్‌ విద్యార్థుల్లో పరీక్షలపై ఉత్కంఠ నెలకొంది. వచ్చేనెల 7 నుంచి ప్రాక్టికల్స్ పరీక్షలకు షెడ్యూల్ ఇచ్చారు. ఏప్రిల్ 1న నైతిక విలువలు, 3న ఎన్విరాన్‌మెంట్ ఎగ్జామ్‌ జరుగుతాయని ప్రకటించారు. అయితే విద్యాసంస్థలు మూసివేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో.. ఇప్పుడు అవి జరుగుతాయా.. లేదా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది. అటు మూడో విడత జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 27 నుంచి జరగాల్సి ఉంది. విద్యాసంస్థలను మూసివేసినా జేఈఈ ఆన్‌లైన్‌ పరీక్షలు ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...

పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల్లో, తల్లిదండ్రుల్లో టెన్షన్‌ తప్పినా.. ఇప్పుడు కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆదేశాలను బట్టే తమ నిర్ణయం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

యథాతథంగా యూనివర్శటీ పరీక్షలు...

ఇక యూనివర్శిటీలు మాత్రం తామిచ్చిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుపుతామని స్పష్టం చేశాయి. ఎవరికైనా కొవిడ్‌ సోకితే వారికి ప్రత్యేకంగా మరో పరీక్ష నిర్వహిస్తామని, రెగ్యులర్‌గానే పరిగణిస్తామని జేఎన్టీయూ తెలిపింది. ఉస్మానియాలో ప్రస్తుతం పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. అవన్నీ యథాతథంగా ఉంటాయని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories