Hyderabad: టీఆర్ఎస్‌లో మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ

Competition for Hyderabad Mayor Position in TRS Party
x

File Image

Highlights

ఇప్పటికే చక్కర్లు కొడుతున్నపలువురి పేర్లు

టీఆర్ఎస్‌లో మేయర్ పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మొదటి నుంచి భారతీ నగర్ కార్పోరేటర్ పేరు సిందూ ఆధర్శ రెడ్డి పేరు చర్చలో ఉంది. అయితే తాజాగా ఈ జాబితాలో గద్వాల్ విజయలక్ష్మి, మోతె శ్రీలతారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం నుంచి సీఎం కేసీఆర్‌తో పనిచేసిన మోతే శోభన్ రెడ్డి సతీమణీ శ్రీలత రెడ్డికి మేయర్ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నగరంలోని మంత్రులు..ఎమ్మెల్యేలు ఎక్కువ మంది శ్రీలతారెడ్డికి సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బంజారాహిల్స్ కార్పోరేటర్ కేకే కూతురు గద్వాల్ విజయలక్ష్మి తనకు మేయర్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి గతంలో తనకు ఎమ్మెల్యేగా టికెట్ రాకపోవడంతో మేయర్ గా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సిట్టింగ్ మేయర్ బొంతు రామ్మోహన్ తన సతీమణీ శ్రీదేవికి అవకాశం ఇవ్వాలని సీఎంతో పాటు మంత్రి కేటీఆర్‌ను కలిసి కోరారు. అయితే ఇందులో బొంతు శ్రీదేవి, మోతే శ్రీలత రెడ్డి తప్ప మిగిలిన వారంతా రెండో సారి గెల్చిన వారే. ఇక డిప్యూటీ మేయర్ గా ఎవరికి అవకాశం ఇస్తారనేది ఆసక్తి కల్గిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ డిప్యూటి మేయర్ బాబా ఫసియుధ్ధీన్ తనకు మరోసారి అవకాశం వస్తుందని బావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories