KTR: వరదల కారణంగా మృతుల కుటుంబాలకు పరిహారం పెంచాలి

KTR
x

KTR

Highlights

KTR: కేవలం రూ. 5లక్షల నష్టపరిహారం ప్రకటించడం అన్యాయం

KTR: తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన బాధిత కుటుంబాలకు పరిహారం పెంచాలని బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం కేవలం 5లక్షల నష్టపరిహారం ప్రకటించడం అన్యాయం అన్నారాయన. 25 లక్షలు నష్టపరిహారం ప్రకటించాల‌ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డే వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు 25 లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. ఇప్పుడు అధికారంలో ఉన్నారు.

మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని 25 లక్షలు పరిహారం ప్రకటించాలని గుర్తు చేశారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. అదే విధంగా వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన, డ్యామేజ్ అయిన వారికి 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు సాయం చేస్తామని చెప్పారు. ఆ హామీని కూడా నెరవేర్చండన్నారు కేటీఆర్. ప్రభుత్వం అసమర్థత, ముందస్తు ప్రణాళిక లేకపోవడం కారణంగానే ప్రాణనష్టం జరిగిందని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories