Mulugu: ములుగు జిల్లా రాజుపేట బ్యాంక్‌లో తాకట్టు బంగారం మాయం

Collateral Gold Disappeared In Rajupeta Canara Bank Of Mulugu District
x

Mulugu: ములుగు జిల్లా రాజుపేట బ్యాంక్‌లో తాకట్టు బంగారం మాయం

Highlights

Mulugu: కెనరా బ్యాంక్‌లో వార్షిక ఆడిట్ చేస్తుండగా వెలుగు చూసిన ఘటన

Mulugu: ములుగు జిల్లా రాజుపేట కెనరా బ్యాంక్‌లో తాకట్టు బంగారం మాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యవసాయం నిమిత్తం పలువురు రైతులు సదరు శాఖలో బంగారం తాకట్టు పెట్టుకుని రుణం తీసుకున్నారు. కోటి 38 లక్షల విలువ చేసే దాదాపు రెండు కిలోల మేర బంగారంను బ్యాంక్ అప్రైజర్ కొట్టేసినట్లు వార్షిక ఆడిట్‌లో అధికారులు గుర్తించారు. బ్యాంకులోని నిల్వలకు... తాకట్టు లెక్కలకు పొంతన లేకపోవడంతో బ్యాంక్ మేనేజర్ దృష్టికి తీసుకెళ్లారు. దీoతో వెంటనే మేనేజర్... బ్యాంక్ అప్రైజర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా... ఆయన అప్పటికే గ్రామం విడిచి భార్య, పిల్లలతో ఉడాయించినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై మంగపేట పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. మంగపేట ఎస్.ఐ రవికుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ప్రస్తుత రేటు ప్రకారం డబ్బులు వారి ఖాతాల్లో జమ చేస్తామని కెనరా బ్యాంక్ అడిషనల్ డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస రావు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories