CM Revanth Reddy : వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు..నేటి నుంచే ప్రక్రియ ప్రారంభించనున్న సీఎం

CM Revanth Reddys order to allocate a double bedroom to the poor in the Musi river catchment area
x

 CM Revanth Reddy : వాళ్లందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు..నేటి నుంచే ప్రక్రియ ప్రారంభించనున్న సీఎం

Highlights

Double Bedroom House: హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు భరోసా కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితిని తీసుకురావద్దాన్నారు. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేయాలని అధికారులకు సూచించారు. అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశాలు జారీ చేశారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను బాధ్యతగా చేపట్టాలని సీఎం అధికారులను సూచించారు. ప్రక్రుతి వైపరీత్యాలు సంభవించకుండా, భవిష్యత్తు అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. దీనిలో భాగంగా నగరంలో ఉన్న అన్ని చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని సీఎం చెప్పారు.

అవటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, ఎప్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రతీ చెరువు నాలాల ఆక్రమణల వివరాలు సేకరించాలన్నారు. వీటికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో నిజమైన, అర్హులైన పేదలకు ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని అప్రమత్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఇక జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories