Revanth Reddy Tweet: కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

CM Revanth Reddy Emotional Tweet on Congress One Year Rule
x

Revanth Reddy Tweet: కాంగ్రెస్ ఏడాది పాలనపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ ట్వీట్

Highlights

Revanth Reddy Tweet: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

Revanth Reddy Tweet: తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. పోరాటాలను, ఉద్యమాలను, త్యాగాలను, ఆత్మబలిదానాలను, ఆకాంక్షలను, ఆశయాలను.. అన్నింటిని కలిపి వీలునామాగా రాసి.. డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ నా చేతుల్లో పెట్టిందని తెలిపారు. తన వారసత్వాన్ని సగర్వంగా సమున్నతంగా ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను అప్పగించిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆ క్షణం నుంచి జన సేవకుడిగా, ప్రజా సంక్షేమ శ్రామికుడిగా.. మదిలో, విధిలో, నిర్ణయాల జడిలో సకల జనహితమే పరమావధిగా జాతి ఆత్మగౌరవమే ప్రాధాన్యతగా సాగిపోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సహచరుల సహకారంతో జనహితుల ప్రోత్సాహంతో విమర్శలను సహిస్తూ.. విద్వేషాలను ఎదురిస్తూ.. స్వేచ్ఛకు రెక్కలు తొడిగి.. ప్రజాస్వామ్యానికి రెడ్ కార్పెట్ పరిచినట్లు ఆయన తన ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు. అవనిపై అగ్ర భాగాన తెలంగాణను నిలిపేందుకు.. గొప్ప లక్ష్యాల వైపు నడుస్తూ నాలుగు కోట్ల ఆశయాలను నడిపిస్తూ నిరంతరం జ్వలించే ఈ మట్టి చైతన్యమే స్ఫూర్తిగా.. విరామం ఎరుగక, విశ్రాంతి కోరక, ముందుకు సాగిపోతున్నాను. ఏడాది ప్రజాపాలనలో ఎంతో సంతృప్తి.. సమస్త ప్రజల ఆకాంక్షలు, సంపూర్ణంగా నెరవేర్చడమే నా సంప్రాప్తి అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories