Revanth Reddy: మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy visited Goddess Mahankali
x

Revanth Reddy: మహాంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

Highlights

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన తొలి బోనాల జాతర పండగ. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సికింద్రాబాద్ వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు.

Ujjaini Mahankali Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఉదయం 8.30గంటలకు అమ్మవారి ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారికి బోనాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కిషన్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘనం స్వాగతం పలికారు. ఆ తర్వాత అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించారు.

ఈ రోడ్లు మూసివేత‌.. -టోబాకో బ‌జార్ నుంచి మ‌హంకాళి టెంపుల్‌కు వ‌చ్చే రోడ్ -బాటా ఎక్స్ రోడ్ నుంచి రాంగోపాల్ పేట పీఎస్ వ‌ర‌కు -జ‌న‌ర‌ల్ బ‌జార్ రోడ్ -ఆద‌య్య ఎక్స్ రోడ్

-మ‌ళ్లింపు మార్గాలు ఇవే.. -సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బ‌స్సుల‌ను చిల‌క‌ల‌గూడ ఎక్స్ రోడ్డు మీదుగా గాంధీ హాస్పిట‌ల్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, క‌వాడిగూడ‌, మారియ‌ట్ హోట‌ల్ మీదుగా మ‌ళ్లించ‌నున్నారు. -సికింద్రాబాద్ స్టేష‌న్‌కు వ‌చ్చే ఆర్టీసీ బ‌స్సుల‌ను బేగంపేట నుంచి క్లాక్ ట‌వ‌ర్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, ఎస్బీఐ ఎక్స్ రోడ్డు మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.





Show Full Article
Print Article
Next Story
More Stories