Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్..ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Book Fair: నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్..ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
x
Highlights

Hyderabad Book Fair: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ బుక్ ఫెయిర్ నేటి నుంచి జనవరి 29వ తేదీ...

Hyderabad Book Fair: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. ఈ బుక్ ఫెయిర్ నేటి నుంచి జనవరి 29వ తేదీ వరకు 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను నిర్వహిస్తున్నామని హెచ్ బీఎఫ్ అధ్యక్షుడు యాకూబ్ షేక్ తెలిపారు.

ఈ బుక్ ఫెయిర్ ను ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బుధవారం ఆయన ఎన్టీఆర్ స్టేడియంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బుక్ ఫెయిర్ లో సమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్లు పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు తెలిపారు.

బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి క్రిష్ణమాచ్యారులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్ గా నామకరణం చేసినట్లు తెలిపారు.

సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ పాత్రికేయులు కె. రామచంద్రమూర్తి, ఆచార్యులు రమా మేల్కేటేలతో సలహా కమిటీని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories