CM Revanth Reddy: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సీఎం రేవంత్ సమీక్ష

CM Revanth Reddy review of integrated residential schools
x

CM Revanth Reddy: ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సీఎం రేవంత్ సమీక్ష

Highlights

CM Revanth Reddy: ప్రభుత్వ స్కూళ్లను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి

CM Revanth Reddy: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లపై సమీక్ష నిర్వహించారు. సెమీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సొంత గ్రామాల్లోనే విద్యార్థులు చదువుకునేలా వీలు కల్పించాలని సూచించారు. అంగన్‌వాడీ ప్లే స్కూళ్ల తరహాలో మూడో తరగతి వరకు విద్యాబోధనకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. అంగన్‌వాడీల్లో విద్యాబోధనకు అదనంగా మరో టీచర్‌ను నియమించాలని కోరారు.

నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్‌లో చదువుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలన్నారు. విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకున్నాక పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులను సూచించారు. ప్రభుత్వ, సీఎస్ఆర్ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories