Revanth Reddy: రైతు రుణమాఫీతో నా జన్మధన్యం అయింది

CM Revanth Reddy Released 2nd Phase Rythu Runa Mafi
x

Revanth Reddy: రైతు రుణమాఫీతో నా జన్మధన్యం అయింది

Highlights

రుణమాఫీతో రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొంది- సీఎం రేవంత్ రైతు రుణమాఫీతో నా జన్మధన్యం అయింది- సీఎం రేవంత్

Rythu Runa Mafi: రైతు రుణమాఫీతో తన జన్మధన్యం అయిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రమంతా రుణాల మాఫీతో పండగ వాతావరణం నెలకొందన్నారు. లక్షన్నర రూపాయల వరకు రుణాలను మాఫీ చేసిన రేవంత్ రెడ్డి ఓట్ల కోసమో.. ఎన్నికల కోసమో రైతు రుణమాఫీ చేయడం లేదని తెలిపారు. ఒకేసారి రైతుల కోసం 31వేల కోట్లు బ్యాంకులకు చెల్లించిన రికార్డు తమ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఈ రెండు నెలలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు.

గతంలో అనేక మంది రైతులు సొంత పొలంలోనే పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకూడదనేదే మా విధానం. అందుకే ఇవాళ రూ.లక్షన్నర వరకు ఉన్న రైతు రుణాలన్నీ మాఫీ చేశాం. రాష్ట్రంలోని రైతులందరి ఇళ్లల్లో ఇవాళ పండుగ రోజు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశాం. రెండో విడతగా రూ.6,190 కోట్లు మాఫీ చేశాం అన్నారు. రుణమాఫీ కింద సుమారు 6.4 లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండో విడతగా రూ.6,190 కోట్లు జమ చేసింది. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేశారు. ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు జమ చేశారు.

తెలంగాణలో రైతులకు మేలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రెండవ విడత రుణమాఫీ సందర్భంగా ఆయన ఈ వ్యఖ్యలు చేశారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ రుణమాఫీ ప్రకటించారని ఆ హమీని నెరవేరుస్తున్నామని చెప్పారు. రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చినప్పుడు సాధ్యం కాదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారని గుర్తు చేశారు. కాని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని సాధ్యం చేసి చూపించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories