Praja Palana Celebrations: నేడు ఆరోగ్య ఉత్సవాలు..

CM Revanth Reddy Public Governance Vijayotsavam 2024
x

Praja Palana Celebrations: నేడు ఆరోగ్య ఉత్సవాలు..

Highlights

Paja Palana Celebrations: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం.

Paja Palana Celebrations: ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్‌లో ఆరోగ్య ఉత్సవాలను నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఇందులో భాగంగా 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకి అపాయింట్‌మెంట్ లెటర్స్‌ను రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. 24 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఉద్యోగ నియామకాలు అందించనున్నారు. 32 ట్రాన్స్ జెండర్ల క్లినిక్‌లు ప్రారంభించనున్నారు సీఎం రేవంత్.

28 ప్రభుత్వ ఎయిడెడ్ హెల్త్ కేర్ కాలేజీలు, 16 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలు ప్రారంభించనున్నారు. 213 అంబులెన్సులను జెండా ఊపి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories