Revanth Reddy: అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

CM Revanth Reddy ongoing visit to America
x

Revanth Reddy: అమెరికాలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన  

Highlights

Revanth Reddy: ఇప్పటి వరకూ 10 కంపెనీలతో చర్చలు, ఒప్పందాలు

Revanth Reddy: పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో బిజీబిజీగా గడుపుతున్నారు. వివిధ MNC కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 5 రోజుల వ్యవధిలో 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నారు. తెలంగాణ స్టార్టప్లలో 100 మిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తుంది. అదే విధంగా ఆర్సీసియం సంస్థతోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ ద్వారా దాదాపు 500 హై– ఎండ్ టెక్ ఉద్యోగాలు లభించనున్నాయి.

స్వచ్ఛ్ బయో సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటిచింది. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా ఐదు వందల మందికి కొలువులు రానున్నాయి. మరో సంస్థ ట్రైజిన్ టెక్నాలజీస్ సంస్థ ద్వారా దాదాపు 1000 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. వీవీంట్ పార్మా 400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది. ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. చార్లెస్ స్క్వాబ్ హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవెలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ ఇండియాలో ఎంచుకున్న మొట్టమొదటి నగరం హైదరాబాద్ కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories