CMRF Application: తెలంగాణవాసులకు శుభవార్త. ఇక నుంచి ఆన్ లైన్లోనే CMRF దరఖాస్తులు

CMRF Application: తెలంగాణవాసులకు శుభవార్త. ఇక నుంచి ఆన్ లైన్లోనే CMRF దరఖాస్తులు
x

CMRF Application: తెలంగాణవాసులకు శుభవార్త. ఇక నుంచి ఆన్ లైన్లోనే CMRF దరఖాస్తులు

Highlights

CMRF Application: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వినిపించింది కాంగ్రెస్ సర్కార్. గత ప్రభుత్వంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టాయంటూ వచ్చిన ఆరోపణలతో రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో ఈ కార్యక్రమానికి నిర్వహించాలన్న సీఎం ఆదేశాలతో ఈ వెబ్ సైన్ ను అధికారులు రూపొందించారు. ఇక నుంచి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకునే అప్లికేషన్లన్నీ ఈ వెబ్ సైట్లోనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

CMRF Application:తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. ఇక నుంచి సీఎం సహాయనిధి అప్లికేషన్స్ ఆన్ లైన్లోనే స్వీకరించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో ఓ వెబ్ సైట్ ను ప్రత్యేకంగా రూపొందించారు. మంగళవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వెబ్ సైట్ ను ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదారి పట్టినట్లుగా పెద్దెత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సారి ఈ విధానాన్ని రూపొందించారు.

ఇప్పటి నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తులు ఈ వెబ్ సైట్లోనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సీఎంఆర్ఎఫ్ కోసం తమ దగ్గరకు వచ్చే వారి వివరాలను తీసుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు తమ సిఫార్సు లేఖను జత చేసి అప్ లోడ్ చేయాలి. దరఖాస్తుల్లో సంబంధిత దరఖాస్తుదారుల బ్యాంక్ అకౌంట్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి. అప్ లోడ్ చేసిన తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించి ఒక కోడ్ ను ఇస్తారు. ఆ కోడ్ ఆధారంగానే ఒరిజినల్ మెడికల్ బిల్లులను సచివాలయంలో అందించాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులకు సంబంధిత ఆసుపత్రులకు పంపించి అధికారులు నిర్ధారించుకుంటారు. అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ను ఆమోదించి చెక్ ను రెడీ చేస్తారు. చెక్ మీద తప్పని సరిగా దరఖాస్తుదారుడి అకౌంట్ నెంబర్ ఉంటుంది. దీని వల్ల చెక్కు పక్కదారి పట్టే ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులు చెక్కులను స్వయంగా దరఖాస్తుదారులకు అందిస్తారు. ఈనెల 15వ తేదీ తర్వాత సీఎంఆర్ఎఫ్ అప్లికేషన్స్ ను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. https//cmrf.telangana.gov.in- వెబ్ సైట్లో అప్లికేషన్స్ అందుబాటులో ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories