Revanth Reddy: ఎయిర్‌పోర్టు మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదు

CM Revanth Reddy Key Announcement Metro Expansion Pharma City
x

Revanth Reddy: ఎయిర్‌పోర్టు మెట్రో, ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదు

Highlights

Revanth Reddy: నగరానికి వచ్చే అవసరం రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం

Revanth Reddy: ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్‌లైన్ చేస్తున్నామని స్పష్టం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ ఖర్చయ్యేలా తమ ప్రభుత్వం మెట్రో ప్రతిపాదన తీసుకొస్తుందని తెలిపారు. గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోలో వెళ్లేవారు ఎవరూ ఉండరని.. MGBS నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో లైన్ వేస్తామన్నారు. నాగోల్ వరకు ఉన్న మెట్రోను కూడా ఎల్బీనగర్ మీదుగా చంద్రాయణగుట్టకు పొడిగించి.. ఎయిర్‌పోర్టుకి వెళ్లే లైన్‌కి లింక్ చేస్తామన్నారు సీఎం రేవంత్‌. అవసరమైతే మియాపూర్ నుంచి రామచంద్రపురం.. మైండ్‌స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌‌కు మెట్రోలైన్‌ పొడిగిస్తామన్నారు.

ఇక ఫార్మాసిటీని కూడా రద్దు చేయడం లేదని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ORR, రీజినల్‌ రింగ్ రోడ్ మధ్య పరిశ్రమల కోసం ప్రత్యేకంగా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. జీరో పొల్యూషన్‌తో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ క్లస్టర్లను అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఆ క్లస్టర్లలోనే పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి గృహనిర్మాణాలు చేస్తామని.. నగరానికి వచ్చే అవసరం రాకుండా అన్ని ఏర్పాట్లు, వసతులు కల్పిస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories