Revanth Reddy: హస్తినలో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్

CM Revanth is busy in Hastina
x

Revanth Reddy: హస్తినలో బిజీబిజీగా గడుపుతున్న సీఎం రేవంత్

Highlights

Revanth Reddy: రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు

Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీని కలిసిన రేవంత్... తెలంగాణలో 500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్న విషయాన్ని ఆయనకు తెలిపారు. వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. అనంతరం జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సమావేశమై... మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కి సహకరించాలని కోరారు.

హైదరాబాద్‌లోని మురికి నీరు అంతా మూసీలో చేరుతోందని... దానిని శుద్ధి చేయాలని సంకల్పించినట్లు కేంద్రమంత్రికి తెలిపారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద మూసీలో మురికి నీటి శుద్ధి పనుల కోసం 4 వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ను గోదావరి నీటితో నింపే పనుల కోసం 6 వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో హైదరాబాద్ ప్రజలకు నీటికష్టాలు తీరుతాయన్నారు. 2019లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైనా... తెలంగాణకు ఈ పథకం కింద నిధులు ఇవ్వలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Show Full Article
Print Article
Next Story
More Stories