CM KCR: సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

CM KCR Yagam for all Round Development
x

CM KCR: సర్వతోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ యాగం

Highlights

CM KCR: కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర

CM KCR: సీఎం కేసీఆర్ ఇక నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగం చేయనున్నారు. ఎర్రవల్లిలోని సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది.

గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్‌ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి యాగంలో ఆసీనులయ్యారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని తలపెట్టారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి ప్రత్యేకమని స్పష్టం చేసారు.

Show Full Article
Print Article
Next Story
More Stories