KCR: ఇవాళ సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్

CM KCR To Sangareddy District Today
x

KCR: ఇవాళ సంగారెడ్డి జిల్లాకు సీఎం కేసీఆర్

Highlights

KCR: బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు సీఎం శంకుస్థాపన.

KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. 4500 కోట్ల రూపాయల నిధులతో నిర్మించతలపెట్టిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షలకు, ఆంథోల్ , నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. సీఎం జిల్లా టూర్‌ ఉండడంతో సంగారెడ్డి జిల్లా యంత్రాంగం పోలీసు అధికారులు అప్రమత్తమ్యారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు మమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు స్వయంగా పరిశీలించారు. మరోవైపు 14 మంది డీఎస్పీలు, 48 సీఐలు, 80 మంది ఎస్ఐలు సహా 1500 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొననున్నారు. నారాయణఖేడ్‌కు సీఎం రాకతో భారీగా జన సమీకరణ లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పని చేస్తున్నారు.

ఇవాళ మద్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక హెలి క్యాప్టర్ ద్వారా జుజాల్ పూర్ వద్ద అనురాధ కాలేజీ ప్రాంగణం సభ స్థలానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. రేపు లక్ష మందితో నిర్వహించ బోయే ఈ సభలో కేసీఆర్‌ ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories