28న టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

CM KCR to Inaugurate New T-Hub Facility on June 28
x

28న టీహబ్‌ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌

Highlights

T-Hub: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్టప్‌ ఇంక్యుబేటర్ టీ హబ్‌-2 ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

T-Hub: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్టప్‌ ఇంక్యుబేటర్ టీ హబ్‌-2 ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. రెండో టీ-హబ్‌ను ఈనెల 28న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నట్టు ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో టీ-హబ్‌ను నిర్మించారు.

కొత్తగా నిర్మించిన ఈ ఫెసిలిటీ సెంటర్‌ హైదరాబాద్‌ ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌కు ఊతమివ్వనున్నది. టీ హబ్‌-2లో ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా వసతులు కల్పించారు. మొదటి టీ-హబ్‌ను 2015లో గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేశారు. గత ఆరేళ్లలో వివిధ కార్యక్రమాల కింద 18 వందల స్టార్టప్‌లను టీ హబ్‌ ప్రోత్సహించింది. సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసింది.


Show Full Article
Print Article
Next Story
More Stories