Breaking News: ప్రైవేట్ టీచర్‌లను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

CM KCR Taken key Decision to Support Private Teachers
x

Breaking News: ప్రైవేట్ టీచర్‌లను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

Highlights

Breaking News: ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Breaking News: ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రెండు వేల రూపాయల ఆర్థిక సాయం తోపాటు కుటుంబానికి 25కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఇందుకు సంబంధించి ప్రైవేటు విద్యాసంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గానూ, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని లక్షా 45వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుందని సీఎం తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories