Dharani Portal : దసరా రోజునే ధరణి పోర్టల్‌: సీఎం కేసీఆర్‌

Dharani Portal : దసరా రోజునే ధరణి పోర్టల్‌: సీఎం కేసీఆర్‌
x
Highlights

Dharani Portal : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్ ను దసరా పండుగ రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. విజయదశమి రోజును...

Dharani Portal : తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్ ను దసరా పండుగ రోజున ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. విజయదశమి రోజును ప్రజలు మంచి మహుర్తంగా భావిస్తున్నందున్న విజయవంతంగా ఈ ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ నే స్వయంగా తన హస్తాలతో ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక ఈ ధరణి పోర్టల్ ను ఏ విధంగా ఉపయోగించాలో డెమో ట్రయల్స్ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సిఎం తెలిపారు.

ప్రతి మండలం, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ నియామకాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్ కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్ లను సిద్ధం చేయాలని చెప్పారు. తహశీల్దార్‌, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలోడాక్యుమెంట్ రైటర్స్‌కు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్ కు వివరాలను అప్ డేట్ చేయడం తదితర అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్ లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తునందున అదే రోజు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని సీఎం పేర్కొన్నారు. దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్ లో ఎంటర్ చేయాలని అధికారులను కోరారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories