CM KCR: పోడు భూముల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR Review on the Distribution of Waste Land Titles
x

CM KCR: పోడు భూముల పట్టాల పంపిణీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

Highlights

CM KCR: జూన్ 24 నుంచి 30 వరకు పోడు భూముల పట్టాల పంపిణీకి నిర్ణయం

CM KCR: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయంలో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే ROFR ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతోను క్రోడికరించి.. రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబందు అందుతున్నదో వీరికీ అదే పధ్దతిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి.. నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థికశాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను కేసిఆర్ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సిఎం తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరితగతిన తయారు చేయాలని,. జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను సిఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక.. జూన్ 14, వైద్య ఆరోగ్య దినోత్సవం రోజున నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సిఎం శ్రీకారం చుట్టనున్నారు. 2వేల పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సిఎం కేసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories