CM KCR: నిత్యం సమీక్షలు జరుపుతున్న సీఎం కేసీఆర్

CM KCR Review On Heavy Rains | TS News
x

CM KCR: నిత్యం సమీక్షలు జరుపుతున్న సీఎం కేసీఆర్

Highlights

CM KCR: జిల్లాల్లో పరిస్థితులపై మంత్రులతో ఆరా

CM KCR: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పరిస్థితులపై నిత్యం అరా తీస్తున్నారు. ఏ జిల్లాలో ఎక్కువ వర్షం కురుస్తుందో అక్కడ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు తగిన జాగ్రత్తలు ఇస్తూ సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని సూచిస్తున్నారు సీఎం కేసీఆర్.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో వర్షాల పరిస్థితులపై నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులు, కలెక్టర్లకు పలు సూచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నదులు, చెరువులు, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రోడ్లు డ్యామేజి కావడంతో ఆర్ అండ్ బి అధికారులు అప్రమత్తం అయ్యారు. అవసరం ఉన్న చోటకు ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందితో పాటు ఇతర శాఖల అధికారులు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. జిల్లాల పరిస్థితి పై మంత్రులతో ఫోన్ లో అరా తీస్తున్నారు.

రాష్ట్రంలో కొన్నిచోట్ల రెడ్ అలెర్ట్ ని ప్రకటించింది వాతావరణ శాఖ. మంచిర్యాల, నిజామాబాద్ ,కోమరభీమ్ జిల్లా ,ఆదిలాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. నిర్మల్, జగిత్యాల,కరీంనగర్ ,పెద్దపల్లి ,ములుగు ,కొత్తగూడెం, భూపాలపల్లి ,వరంగల్ , హన్మకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇంకా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నిత్యం అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలపడంతో సిబ్బంది అలర్ట్ య్యారు. ఇప్పటికే చెట్ల క్రింద ఉండరాదని ప్రజలకు సూచించారు. కరెంట్ స్తంభాల దగ్గర కూడా ఎవరు ఉండొద్దని, ఎర్తింగ్ వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories