CoronaVirus: వైద్య సిబ్బంది నియామకాలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్

CM KCR Review Meet on Corona Situation in Teangana
x

సీఎం కేసీఆర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

CoronaVirus: తెలంగాణలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి.

CoronaVirus: తెలంగాణలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు నెలల కాలానికి తాత్కాలిక ప్రాదిపదికన వైద్య సిబ్బంది నియామకాలకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారు. ఈ మేరకు ఈ రోజు రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

వైద్య సిబ్బందికి గౌరవప్రదమైన జీతాలు చెల్లించాలని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వారికి వెయిటేజీ ఇవ్వాలని సూచించారు. అంతేకాక ప్రజలకు సేవ చేసేందుకు యువ డాక్టర్లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసి రెడీ ఉన్నారని, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సూపర్‌స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాటిల్లో సిబ్బందిని కూడా తక్షణం నియమించుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. ఆటోడ్రైవర్లు, క్యాబ్‌ డ్రైవర్లు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, వీధి వ్యాపారులు, కార్మికులను గుర్తించి వ్యాక్సిన్‌ ఇవ్వాలని అధికారులకు సూచించారు

Show Full Article
Print Article
Next Story
More Stories