ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించారు: సీఎం కేసీఆర్

ప్రణాళికలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయించారు: సీఎం కేసీఆర్
x
Kcr File Photo
Highlights

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి సమతౌల్యంతో ఉందని కేసీఆర్ ఆయన్ని కొనియాడారు.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదివారం ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తి సమతౌల్యంతో ఉందని కేసీఆర్ ఆయన్ని కొనియాడారు. మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమం కోసం, అదే విధంగా అన్ని రంగాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకుందని తెలిపారు. ఈ బడ్జెట్ కూడా అందుకు అనుకూలంగా బడ్జెట్లో కేటాయింపులున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణలోని గ్రామాలు, పట్టణాల వికాసం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ఈ సంక్షేమ పథకాల్లో మరింత మంది పేదలకు అవకాశం రావాలనే సంకల్పానికి, ఎన్నికల హామీల అమలుకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని కితాబిచ్చారు. తెలంగాణ ప్రజల అవసరాలకు, తెలంగాణ రాష్ట్ర ఆదాయ వనరులకు మధ్య సమతౌల్యం ఉండే విధంగా బడ్జెట్ రూపొందించారని తెలిపారు. ఇది ఒక వాస్తవిక బడ్జెట్ అని ముఖ్యమంత్రి అన్నారు.

దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొని ఉందని, ఆ కారణంగా రాబడులు తగ్గి, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతలు ఏర్పాడ్డాయని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధి కుంటుపడకుండా ఉండే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించడం అభినందనీయని అన్నారు. దీన్ని సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌గా ఆయన అభివర్ణిస్తూ అసెంబ్లీలో హరీశ్ రావు.. బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం సీఎం కేసీఆర్ ఆయణ్ని ప్రత్యేకంగా అభినందించారు.

ఇక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన అనంతరం మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బడ్జెట్ రూపకల్పనలో పాలు పంచుకున్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, ఇతర ఆర్థిక శాఖ అధికారులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories