నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్‌
x
Highlights

తెలంగాణలో ఆరో విడత హరిత పండుగ ప్రారంభమయింది. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో...

తెలంగాణలో ఆరో విడత హరిత పండుగ ప్రారంభమయింది. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అడవి పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సాపూర్‌లో సీఎం అల్లనేరేడు మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపూర్‌లో అర్బన్‌ ఫారెస్ట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రతీ ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ప్రభుత్వం పిలుపునిస్తోంది. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ పచ్చని పండుగను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ఏడాది 30కోట్ల మొక్కలు నాటే లక్ష‌్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో 85 శాతం మొక్కలు తప్పనిసరిగా బతికేలా చర్యలు చేపడుతున్నారు. గత ఐదు విడతల్లో నాటిన మొక్కలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. రాష్ట్ర మంతటా పచ్చదనం పెరుగుతోంది. రహదారుల వెంట చెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలో పచ్చదనం పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories