CM KCR: సీఎం కేసీఆర్​ అధ్యక్షతన కృష్ణా జలాల అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష

CM KCR High Level Review Meeting on Krishna Water
x

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

Highlights

CM KCR: స్వయం పాలనలో సాగునీటి కష్టాలు రానివ్వకూడదని తీర్మానం

CM KCR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన కృష్ణా జలాల అంశంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందే వ్యూహంపై చర్చించారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలు రానివ్వకూడదని సమావేశంలో తీర్మానించారు. వ్యూహం, ఎత్తుగడలపై అధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని వేదికపై రాజీలేని పోరాటం చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతినేలా ఏపీ వైఖరి ఉందని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర నీటి వాటా రాబట్టుకోవాలని ఇప్పటికే కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. జలవిద్యుదుత్పత్తి కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ట్రైబ్యునల్స్, కోర్టుల్లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలని సీఎం అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణి బలంగా వినిపించాలని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర నీటి వాటాపై పలు సందర్భాల్లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చామని సీఎం వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories