Telangana Formation Day: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు విశ్రమించను- కేసీఆర్

CM KCR Greet to People on Telangana Formation Day
x

కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Highlights

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక పోరాటాలు, త్యాగాలు బలిదానాలతో ప్రజాస్వామిక పద్దతిలో పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో గర్వించదగ్గ రీతిలో నిలబెట్టుకున్నామన్నారు. ఏడేండ్ల కాలంలోనే ధృఢమైన పునాదులతో సుస్థిరతను చేకూర్చుకున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు సీఎం. తెలంగాణ ప్రభుత్వం నాటి ఉద్యమ నినాదాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని తెలిపారు.

దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి, సహచర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో నిలబెట్టుకున్నందుకు తనకు గర్వంగా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. సమైక్య రాష్ట్రంలో విస్మరించబడిన రంగాలను చక్కదిద్దుకుంటూ వస్తున్నామన్నారు. తెలంగాణ సమాజంలో తొంభై శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు సీఎం. ప్రజా ఆకాంక్షలను కార్యాచరణలో పెట్టాలనే చిత్తశుద్ది అమరుల త్యాగాలకు అభివృద్ధి ద్వారా ఘన నివాళి అర్పించాలనే స్పూర్తి ఉందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం అందుకున్న ఘన విజయంలో ప్రజల సహకారం మహా గొప్పదంటూ ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. కరోనా ఉపద్రవం వలన రాష్ట్ర ఖజానాకు కొంత ఇబ్బంది కలిగినా ప్రజల సహకారంతో ఎప్పటికప్పుడు నిలదొక్కుకుంటూ ముందుకు పోతున్నామన్నారు. ప్రజలు తనమీద నిలిపిన విశ్వాసం, అభిమానమే తనకు కొండంత ధైర్యమన్నారు. ప్రజలిచ్చిన భరోసాతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే వరకు తాను విశ్రమించనని స్పష్టం చేశారు కేసీఆర్.

Show Full Article
Print Article
Next Story
More Stories