Telangana: టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ ఊహించని ట్విస్ట్

CM KCR Give Big Twist to TRS Leaders
x

Telangana: టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ ఊహించని ట్విస్ట్

Highlights

Telangana: తెలంగాణ రాష్ట్ర్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీల శ్రేణులకు నాయకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

Telangana: తెలంగాణ రాష్ట్ర్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీల శ్రేణులకు నాయకులకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మొదటి నుంచి సాగర్ బరిలో నిలిచే పలువురు అభ్యర్దుల పేర్లు ప్రచారం చేసి చివరలో అందరు ఊహించని విధంగా దివంగత ఎమ్మెల్యే నోములు నర్సింహయ్య కుమారుడు భగత్ కే భీ ఫారం అందజేసి అందరిని ఆచ్చర్యంలోనికి నెట్టారు. అటు ప్రతి పక్ష బీజేపీకీ ఆప్షన్ లేకుండా చేసి తనదైన రాజకీయ చాణక్యం చాటుకున్నారు గులాబీ బాస్.

నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్ల గడువుకు ఒక రోజు ముందు ఆధికార టీఆర్ఎస్ అభ్యర్ధిని ఖరారు చేసింది. దుబ్బాక ఉపఎన్నిక ఫలితంతో పాత ఆనవాయితీని గులాబీ దళపతి పక్కన బెట్టే అవకాశం ఉందని అంతా భావించారు అయినా అందరి ఊహాగానాలకు తెరదించుతూ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహ్య కుమారుడు నోముల భగత్ ను ఎన్నికల బరిలోకి దించారు. వారసులకు టికెట్ ఇచ్చే పద్దతికి చెల్లు చీటి రాసిచ్చేసారని గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ ఇస్తారన్న ఊహాగానాలు కొనసాగాయి. వాటన్నంటిని పటా పంచలు చేస్తూ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

చివరి నిమిషం వరకు అభ్యర్ధి పేరు విషయంలో గోప్యత పాటించిన కేసీఆర్ తొలుత బీసీలకు టికెట్ ఇస్తారని అది యాదవులకే ఇస్తారని ప్రచారం చేశారు. నొముల కుటుంబానికి టికెట్ రాదనే అంచనాలో ఉన్నారు. రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, శ్రీనివాస్ యాదవ్ తో పాటు పార్టీ నేతలు కోటిరెడ్డి, తేరా చిన్నపరెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అయినా ఎలాంటి గ్రూపులకు ఆస్కారం లేకుండా నోముల భగత్ కు భీ ఫాం ఇచ్చారు గులాబీ బాస్. టికెట్ ఆశించిన మంత్రి జగదీశ్ రెడ్డి సన్నిహితుడు కోటిరెడ్డిని పార్టీ నేతలు బుజ్జగించారు. ఆయనతోపాటు పలువురు నేతలను పార్టీ అభ్యర్ధి విజయం కోసం పని చేయాలని స్వయంగా కేసీఆర్ సూచించారు. కోటిరెడ్డికి మరో విధంగా న్యాయం చేస్తామని కేసీఆర్ ద్వారా హామీ ఇప్పించినట్లు తెలుస్తోంది.

2018 ఎన్నికల్లో నోముల నర్సింహయ్యపై పోటీ చేసి ఓటమిపాలైన మాజీ మంత్రి జానారెడ్డి తిరిగి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తుండటంతో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. మండలాల వారీగా పార్టీ తరపున ప్రచారం ముమ్మరం చేశారు. పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించిన ఊపుతో గులాబీ శ్రేణులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories